ర‌జీని పార్టీ గుర్తు సైకిల్‌…. …

చైన్నైః త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జనీ కాంత్ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రాజ‌కీయ పార్టీని ప్రారంభించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే. అయితే ర‌జ‌నీ ప్రారంభించ‌బోయే పార్టీ గుర్తును ఖ‌రారు. చేసేందుకు ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం . పార్టీ గుర్తుగా సైకిల్ ను ఖ‌రారు చేస్తే ఎలా ఉంటుంది?అన‌ఇ ఇప్ప‌టికే స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్లు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ర‌జ‌నీ న‌టించిన అన్నామ‌లై మూవీలో సైకిల్‌, పాల క్యాన్ గెట‌ప్‌లో ఆయ‌న ద‌ర్శ‌నిమ‌చా్చ‌రు.. పార్టీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఈ నెల 31న వెల్ల‌డిస్తామ‌ని ర‌జ‌నీ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా త‌న అభిమానుల‌కు న్యూఇయ‌ర్ గిప్ట్ ఇచ్చారు. త‌మ పార్టీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడుఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేస్తుంద‌ని త‌లైవా సృష్టం చేశారు.త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మార్పు అనివార్య‌మ‌ని, ఆ మార్పు త‌న‌తోనే సాధ్య‌మ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల స్వ‌చ్చ‌మైన‌, ఆధ్మాత్మిక విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు బాట‌లు వేస్తామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల సంక్షేమ కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వ‌స్తే ఆవిష‌యంలో నాకంటే ఎక్కువ‌గా ఎవ‌రూ సంతోషించ‌రు. నేను ఎప్పుడూ మాట త‌ప్ప‌ను. రాజకీయ మార్పు చాలా ముఖ్యం .ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అద్బుతం జ‌రుగుతుంద‌ని త‌మ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *