బాల‌య్య పోరాటం నంద్యాల‌లో……

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌య్య బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇది బాల‌య్యబాబు,బోయ‌పాటిల కాంబోలో వ‌చ్చిన వ‌స్తున్న మూడవ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ తిరిగి మొద‌లైంది. మొద‌ట్లో మూవీలోని ప‌లు కీల‌క,యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను వార‌ణాసిలో చిత్రీక‌రించాల‌ని భావించారు. బోయ‌పాటి లాక్‌డౌన్ మూలంగా అది కుద‌ర‌లేదు. ఇప్పుడు ఇదే షెడ్యూల్ నంద్యాలలో చేయ‌నున్నారు. నంద్యాల చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు. ఇందులో ఎక్కువ‌గా పోరాట స‌న్నివేశాలే ఉంటాయ‌ట‌. ఇందులో బాల‌య్య‌కు జోడిగా ప్ర‌గ్యాజైస్వాల్‌,పూర్ణ న‌టిస్తున్నారు. మ‌రోక ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండ‌గా ప్ర‌ధాన ప్ర‌తినాయకుడు ఎవ‌ర‌నేది ఇంకా బ‌య‌ట‌పెట్ట‌లేదు. టీమ్‌. బోయ‌పాటి ప్ర‌తి మూవీలోనూ హీరోను స‌మానంగా విల‌న్ పాత్ర‌లు ఉంటాయి. అప్పుడే హీరో పాత్ర బ‌లంగా ఎలివేట్ అవుతుంద‌నేది బోయ‌పాటి సూత్రం. అందుకే బాల‌కృష్ణ కు స‌రి‌స‌మాన‌మైన స్టేచ‌ర్ క‌లిగిన న‌టుడి కోసం వెతుకుతున్నార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీన్ని త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *