అంద‌మైన కవిత‌తో ఆహ్లాద‌క‌ర‌మైన ఫోటోలు షేర్ చేసిన చిరు

లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ వ‌స్తున్న చిరు కొద్ది సేప‌టి క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్లోని పూల‌కుండీల ఫోటోల‌ని షేర్ చేశాడు. ఓ ఫోటోలో ప్ర‌భాత స‌మ‌యంలో మందార పువ్వు విక‌సించి ఉండ‌గా, దానిని ఉద్ధేశించి ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది .. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది! అని కామెంట్ పెట్టారు. ఇవి నెటిజన్స్‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని త‌న ఇంటి ద‌గ్గ‌ర నుండి తీసిన అంద‌మైన వీడియో షేర్ చేశారు. ఇందులో లాక్ డౌన్ సంద‌ర్భంగా సిటీ ఎంత ప్ర‌శాంతంగా ఉందో అని చెబుతూ.. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూపించారు. రోజూ మన పనుల్లో పడి గమనించడం లేదు కానీ మన నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ప‌క్షుల ప‌లుకులు ఎంత స్వీట్‌గా ఉన్నాయి అని చిరు వీడియోలో పేర్కొన్నారు . అదే వీడియోలో త‌న ఇంటిని కూడా కొద్దిగా చూపించారు. కొండపై అత్యంత విలాసవంతంగా క‌ట్టిన ఈ ఇంటి ముందు పెద్ద లాన్.. పూల చెట్లు.. పెద్ద స్విమ్మింగ్ పూల్.. ఆ పక్కనే కార్లు.. దాంతో పాటే ఇంద్రభవనం లాంటి ఇల్లు అన్నీ ఆ వీడియోలో బాగా క‌నిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *