ఇకపై వందేండ్ల‌యినా ఆపార్టీ అధికారంలోకి రాదు…..

ముంబై: శివ‌సేన‌సీనియ‌ర్ నాయ‌కుడు బీజేపీ ఇక వందేండ్ల‌యినా అధికారంలోకి రాద‌ని ఎంపీ సంజ‌య్‌రౌత్ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర అధికార కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌తో ప్ర‌తిప‌క్ష బీజేపీ నేత‌, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భేటీ గురించి విలేక‌రులు ముచ్చ‌టిస్తూ రౌత్ పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ప‌వార్‌తో త‌న భేటీపై దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఇప్ప‌టికే స్పందించారు. తాను కేవ‌లం మర్యాద‌పూర్వ‌కంగానే ఆయ‌న‌ను క‌లిశాన‌ని, ఈ బేటీకీ, రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు. అయినా రాష్ట్రంలో తాజా కూటమి ఏర్పాటు కాబోతున్నద‌న్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ సంగ‌తీన్ని మీడియా ప్ర‌తినిధులు సంజ‌య్ రౌత్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌గా ఆయ‌న స్పందించారు. ప్ర‌తి భేటీని రాజ‌కీయ కోణంలో చూడొద్ద‌ని చెప్పారు. ఆ భేటీలో మంచి ప్ర‌తిప‌క్ష నేత ఎలా ఉండాల‌నే విష‌యంలో ఫ‌డ్న‌వీస్‌కు శ‌ర‌ద్‌ప‌వార్ స‌ల‌హాలు ఇచ్చి ఉంటార‌ని చ‌మ‌త్క‌రించారు. ఒక‌వేల ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వాన్నికూల్చేందుకే క‌నుక ప‌వార్‌తో భేటీ అయ్యి ఉంటే ఇకపై వందేండ్ల‌యినా ఆపార్టీ మ‌హారాష్ట్ర‌లో అధికారంలోకి రాద‌న్నారు. మ‌హారాష్ట్ర, ప‌శ్చిమ‌బెంగాల్లో ఆప‌రేష‌న్ క‌మ‌లం ప‌నిచేయ‌ద‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *