ఉద్యోగాల భ‌ర్తీకి భారీగా నోటీఫికేష‌న్లు క‌స‌ర‌త్తు చేస్తున్న తెలంగాణ సర్కార్‌

.హైద‌రాబాద్ః ఖాళీ పోస్టుల జాబితా రూపొందించాల‌ని సీఎస్ సోమేష్‌కుమార్ ను ఇటీవ‌ల ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎస్ అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి శాఖ‌ల‌వారీగా ఖాళీల వివ‌రాల‌ను ఆర్థిక‌శాఖ‌కు అందించాల‌ని ఆదేశించారు. కార్పొరేష‌న్ల‌లో ఉన్న ఖాళీల వివ‌రాల‌ను కూడా అందించాల‌ని సూచించారు. ఈ మేర‌కు ఆయాశాఖ‌ల కార్య‌ద‌ర్శులు ,ముఖ్య‌కార్య‌ద‌ర్శులు శాఖ‌ల‌వారీగా ఖాళీల వివ‌రాల‌ను ఆర్థిక‌శాఖ‌కు అందజేస్తున్నారు. విద్య‌, హోంశాఖ‌ల‌లో ఎక్కువ‌గా ఖాళీలున్న‌ట్టు స‌మాచారం. దీంతో పాటు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, కార్పొరేస‌న్లు, సొసైటీలు క‌లిసి దాదాపు 200వ‌ర‌కు సంస్థ‌లున్నాయి. వీటిల్లో కూడా చాలా ఏండ్లుగా ఉద్యోగ నియ‌మ‌కాలు చేప‌ట్ట‌లేదు. ఆయా సంస్థ‌ల్లో చాలా వ‌ర‌కు ఖాళీలున్నాయి. ఈ ఖాళీల భ‌ర్తీకి కూడా నోటీఫికేష‌న్ విడుద‌ల చేస్తే మంచిద‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇందుకు ఆయా సంస్థ‌లు ,కార్పొరేష‌న్లు, సొసైటీల‌లో ఉన్న ఖాళీల వివ‌రాల‌ను ప్ర‌భుత్వం సేక‌రిస్తున్న‌ది.
ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కుత్వ‌ర‌లో నివేదిక‌
ఆయా వివ‌రాల‌న్నిటినీ క్రోడీక‌రించి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నివేదించ‌నున్న‌ట్టు తెలిసింది. వీటీ ఆధారంగా సీఎం కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఆమోదించిన వెంట‌నే వ‌రుస‌గా ఉద్యోగాల భ‌ర్తీకి భారీగా నోటీఫికేష‌న్లు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. కార్పొరేష‌న్లు, సంస్థ‌లు, సొసైటీల్లోని ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌జ్ఞం తీసుకుంటే …గిడ్డంగులు, విత్త‌నాభివృద్ధి, టెస్కో, అట‌వీ అభివృద్ది, పౌర‌స‌ర‌ఫ‌రాలు, ఖ‌నిజాభివృద్ధి, బేవ‌రేజెస్‌, పాడిప‌రిశ్ర‌మ ,ఆగ్రోస్‌, వ‌ర్సిటీలు, గొర్రెలు,మేక‌ల అభివృద్ది , తెలంగాణ పుడ్స్ త‌దిత‌ర సంస్థ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *