టీఆర్ ఎస్‌ను ప్ర‌జ‌లు ప్ర‌శ్నించాలి….

హైద‌రాబాద్ః భార‌తీయ జ‌న‌తాపార్టీకి హైద‌రాబాద్ న‌గరంతో విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్క‌క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్య క్ర‌మ‌రంలో కిష‌న్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నే సంక‌ల్పంతో ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌చారానికి త‌క్కువ స‌మ‌యం ఉన్నా స‌ద్వినియోగం చేసుకుంటామ‌న్నారు.డ‌బుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల హామీ ఏమైంద‌ని తెరాస‌ను ప్ర‌శ్నించారు.గ‌త ఎన్నిక‌ల‌కు ముందు స‌న‌త్‌న‌గ‌ర్ ఐడీహెచ్ కాల‌నీలో రెండు ప‌డ‌క గ‌దుల ఇళ్ల‌ను ప్రారంభించారు.బ‌స్తీల్లోని ప్ర‌జ‌ల‌ను వాహ‌నాల్లో త‌ర‌లించి ఐడీహెచ్ ఇళ్ల‌ను చూపించారు. ఐడీహెచ్ ఇళ్ల‌ను చూసి ప్ర‌జ‌లంతా భ్ర‌మ‌ప‌డ్డారు. ఇళ్లు ఇస్తార‌నే న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లంతా తెరాస‌కు మూకుమ్మ‌డిగా ఓటేశారు. పేద ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌ల్లో ఉంచి ఓట్లు దండుకున్నారు. ఐదేళ్లు పూర్త‌యినా పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌లేకోపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెరవేర్చ‌ని తెరాస‌ను ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ స‌ముద్ర‌ముగా మార‌డానికి ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే కార‌ణం.న‌గ‌రంలో సుమారు 6ల‌క్ష‌లు ఇళ్ల‌లోకి నీరు చేరింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా 40 మంది అమాయ‌క ప్ర‌జ‌లు చ‌నిపోయారు.అని కిష‌న్‌రెడ్డి వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *