బీజేపీకి అంత స‌త్తా ఉందా? మ‌ంత్రి కేటీఆర్‌

minister,ktr,press,meetహైద‌రాబాద్ః సీఎం కేసీఆర్ మ‌హిళా ప‌క్ష‌పాతి అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. టీఆర్ ఎస్ గ్రేట‌ర్ అభ్య‌ర్థుల‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా గ్రేట‌ర్ అభివృద్ధి ప్ర‌గ‌తి నివేదిక‌ను కేటీఆర్ విడుద‌ల చేశారు. 150మంది అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేశారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడారు.150 డివిజ‌న్ల‌లో 85డివిజ‌న్ల‌ను మ‌హిళ‌ల‌కే కేసీఆర్ కేటాయించారు. అభ్య‌ర్థుల ఎంపిక‌లోసామాజిక న్యాయం పాటించాం. 50శాతం సీట్లు బీసీల‌కు కేటాయించాం. టికెట్లు రానివారిని అభ్య‌ర్థులు క‌లుపుకొని పోవాలి. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో హైద‌రాబాద్ లో కొంద‌రికి అపోహ‌లుండేవి.ఈ ఆరేళ్ల‌లో హైద‌రాబాద్‌లో ఎక్క‌డా చిన్న గొడ‌వ కూడా జ‌ర‌గ‌లేదు. సీఎం కేసీఆర్ రాష్ట్రాని్న అద్భుతంగా పాలిస్తున్నారు. ఇది అంద‌రి హైద‌రాబాద్ ఇది అంద‌రి కోసం ప‌నిచేసే ప్ర‌భుత్వం టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక పేకాట క్ల‌బ్‌లు లేవు. గుడుంబా వాస‌న లేదు. శాంతిభ‌ద్ర‌త‌లు ప‌టిష్టంగా ఉండ‌బ‌ట్టే.. పెట్టుబ‌డులు భారీగా వ‌స్తున్నాయి. ఈ ఆరేళ్లలో కేంద్రం హైద‌రాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలి. హైద‌రాబాద్ కోసం చేసిన ఒక్క ప‌నినైనా చూపెట్టే ద‌మ్ము బీజేపీకి ఉందా? వ‌ద‌ర సాయంపై కేంద్రం ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. అని కేటీఆర్ విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *