మ‌జ్లిస్‌తో స్నేహ‌పూర్వ‌క ఒప్పందం ఎక్క‌డుంద‌ని కేటిఆర్ ప్ర‌శ్నించారు….

హైద‌రాబాద్ఃగెలుపు అవ‌కాశాల మేర‌కు జీహెచ్ఎంసీలో కొంత‌మంది అభ్య‌ర్థుల‌ను మార్చామ‌ని తెరాస కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో అసంతృప్తులు ఉండ‌టం అత్యంత స‌హ‌జ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.గెలిచే సీట్ల‌లో ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉంటార‌ని, అదే స‌మ‌యంలో అస‌మ్మ‌తి నేత‌ల‌కు ఒప్పించి ముందుకెళ్లాల్సిన అవ‌సర‌ముంటుంద‌న్నారు. .క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కొంత‌మంది అభ్య‌ర్థులను ఎంపిక చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.తెరాస విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు మాత్ర‌మే మ‌జ్లిస్‌మ‌ద్ధ‌తిస్తోంద‌ని.. తాము కూడా గ‌తంలో ఇదే త‌ర‌హాలో భాజాపాకు స‌హ‌క‌రించిన విష‌యాన్నిఆయ‌న గుర్తు చేశారు.ఎంఐఎం పోటీ చేసిన‌స్థాన‌ల్లోనూ త‌మ అభ్య‌ర్థుల‌ను నిలిపామ‌న్నారు.గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌నగ‌ర్ లో త‌మ‌పైఎంఐఎం పోటి పెట్టింద‌ని.. త‌మ అభ్య‌ర్థుల‌కు నిలిపామ‌న్నారు.త‌మఅభ్య‌ర్థి ప్ర‌కాశ్‌గౌడ్‌ను ఓడిచేశార‌న్నారు.2016 జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పాత‌బ‌స్తీలో తెరాస ఐదు సీట్లు గెలిచింద‌నిగుర్తు చేశారు. మ‌జ్లిస్‌తో స్నేహ‌పూర్వ‌క ఒప్పందం ఎక్క‌డుంద‌ని ఈసంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌శ్నించారు.రాష్ట్రంలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని… హైద‌రాబాద్‌పై భారం త‌గ్గించేందుకు టౌన్‌షిప్ పాల‌సీ తీసుకొచ్చామ‌ని ఆయ‌న వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *