మెహిదీప‌ట్నంలో ఎంఐఎం గెలుపొందింది…

హైద‌రాబాద్ః హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తొలి ఫ‌లితం వెల‌వ‌డింది. మెహిదీప‌ట్నంలో ఎంఐఎం గెలుపొందింది. ఎంఐఎం అభ్య‌ర్థి మాజిద్ హుస్సేన్ విజ‌యం సాధించారు. గ‌తంలో ఆయ‌న జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా ప‌ని చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తొలి రౌండ్ లెక్కింపు ముగిసింది. కొన్ని డివిజ‌న్ల‌లో తొలి రౌండ్‌ఫ‌లితాలు వెలువ‌బ‌డు తున్నాయి. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ‌లో కొన‌సాగుతోంది. ఆర్సీపురం, ప‌టాన్‌చెరు, చందాన‌గ‌ర్‌, హ‌ఫీజ్‌పేట్‌లో టీఆర్ ఎస్ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. హైద‌ర్ న‌గ‌ర్‌, జూబ్లీహిల్స్‌, ఖైర‌తాబాద్, ఓల్డ్‌బోయ‌న్ ప‌ల్లిలో టీఆర్ ఎస్ ఆధిక్యంలో ఉంది. బాలాన‌గ‌ర్‌, చ‌ర్ల‌ప‌ల్లి, కాప్రా, మీర్‌పేట్, శేరిలింగంప‌ల్లిలోనూ టీఆర్ ఎస్ లీడ్‌లో కొన‌సాగుతోంది. గాజాల‌రామారం,రంగారెడ్డి న‌గ‌ర్‌, కొత్త పేట‌లో టీఆర్ ఎస్ లీడ్‌లో ఉంది. కేపీహెచ్‌బీ, మూసాపేట‌లో టీఆర్ ఎస్ ఆధిక్యంలో ఉంది. కొత్త పేట‌, స‌రూర్‌న‌గ‌ర్‌, హ‌స్తినాపురం, వ‌న‌స్థ‌లిపురంలో బీజేపీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. చైత‌న్య‌పురి, గ‌డ్డిఅన్నారం, ఆర్కేపురం, హ‌య‌త్ న‌గ‌ర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *