త‌మ‌కు ఎవ‌రినో ఇబ్బంది పెట్టాల‌న్నా ఉద్ధ‌శ్యం లేదు…

I have, no ,intention, of, bothering, anyone ,TRS,KTR,KCRజీహెచ్ ఎంసి ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌ది. కేటీఆర్ అనేక ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. గ‌డిచిన ఆరేళ్ల‌లో పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌కు అందించామ‌ని అన్నారు. జ‌వాబుదారీత‌నం కోసం కొత్త చ‌ట్టాలు తీసుకొచ్చామ‌ని తెలిపారు. ల్యాండ్ రిజిస్ట్రేష‌న్‌,మ్యుటేష‌న్ కోసం కొత్త ప‌ద్ధ‌తి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని, ఒక‌వేళ కానీ ప‌క్షంలో కొన్ని రోజులు పాత ప‌ద్ధ‌తిలోనాన్ అగ్రిక‌ల్చ‌ర్ ల్యాండ్ ల రిజిస్ట్రేష‌న్ కోసం సీఎంతోమాట్లాడి ఒప్పిస్తామ‌ని అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌తి అంగుళం భూమిని డిజిట‌ల్ స‌ర్వే చేయ‌బోతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. త‌మ‌కు ఎవ‌రినో ఇబ్బంది పెట్టాల‌న్నా ఉద్ద‌శ్యం కాద‌ని కేటీఆర్ తెలిపారు. గ‌డిచిన ఐదేళ్ళ‌లో హైద‌రాబాద్ లో మంచినీటి స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రుచుకున్నామ‌ని అన్నారు.హైద‌రాబాద్ లో 5ల‌క్ష‌ల సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల‌లో 60శాతం తెలంగాణ‌లోనే ఉన్నాయ‌ని అన్నారు. కేంద్ర రాజ్యాంగ బ‌ద్ధంగా ఇవ్వాల్సిన మొత్తం మాత్ర‌మే తెలంగాణకి ఇచ్చింద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *