తొలి వ్యాక్సిన్ త‌మ‌కే ఇవ్వాల‌ని ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు….

He, appealed, to, the, Prime Minister, to ,give, the, first ,vaccine, to, himselfహైద‌రాబాద్ః ప్ర‌పంచ‌మంతా క‌రోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ప‌లు దేశాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్ త‌యారీలో కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయి. క‌రోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డంలో హైద‌రాబాద్‌లో ఉన్న భార‌త్ బ‌యోటెక్; బ‌యోలాజిక‌ల్‌, ఈ,త‌దిత‌ర కంపెనీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. అయితే న‌గ‌రం నుండి వ్యాక్సిన్ త‌యారీ అవుతున్న కార‌ణంగా ముందుగా వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్ర‌జ‌ల‌కే ఇవ్వాల‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేస్తున్నారు. ఈమేర‌కు ప్ర‌ధాని మోడీని ఈట‌ల కోరారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు స‌రిపోయేన్ని డోసుల‌ను ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తిచేశారు. క‌రోనా భ‌యం పూర్తిగా పోలాలంటే వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం కాబ‌ట్టి ప్ర‌జ‌లంద‌రికీ అతిత్వ‌ర‌లో వ్యాక్సిన్ అందేలా చూడాల‌ని ప్ర‌ధానిని ఈట‌ల కోరారు. తొలి వ్యాక్సిన్ ను త‌మ‌కే ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *