వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌పై సీఎం స‌మీక్ష‌..

హైద‌రాబాద్ః వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్ల‌పై సీఎం కేసీఆర్ శ‌నివారం ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తులు రిజిస్ట్రేష‌న్ల‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై అధికారుల‌తో చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో పాటు రెవెన్యూ ఉన్న‌తాధికారులు పాల్గొనున్నారు. వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేస‌న్ల‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్ర‌భుత్వానికి అంద‌లేదు. అందిన త‌రువాత దానిపై కూలంక‌షంగా చ‌ర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.హైకోర్టు నిర్ణ‌యంపై సుప్రీం కోర్టుకు వెళ్ల‌డ‌మా? లేదంటే త‌గు విధ‌మైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను చేపట్ట‌డ‌మా? అనే అంశంపై రెవెన్యూ న్యాయ శాఖ‌ల నిపుణుల‌తో చ‌ర్చించి సీఎం తుది నిర్ణ‌యంతీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *