కౌంటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద మీడియాను అనుమ‌తించండి -హైకోర్టు ఆదేశం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కౌంటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద మీడియాకు అనుమ‌తి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ప‌లు కౌంటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద‌కు మీడియాను అనుమ‌తించని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కౌంటింగ్‌కు సంబంధించిన స‌మాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాక‌రించారు. దీంతో కౌంటింగ్ సెంట‌ర్ల వ‌ద్ద మీడియా ప్ర‌తినిధులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ వ్యవ‌హారాన్ని ప‌లువురు మీడియా ప్ర‌తినిన‌ధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్ర‌తినిధుల‌కు అనుకూలంగా ఆదేశాలు జారీచేసింది. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు మీడియాను అనుమ‌తించాలంటూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ను హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *