హైద‌రాబాద్‌లో 137 లింక్ రోడ్లు ….

హైద‌రాబాద్ః హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ రెండు లింక్ రోడ్ల‌ను రంభించుకుంటున్నామ‌ని తెలిపారు. మొద‌టిద‌శ‌లో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ.313 కోట్ల 65ల‌క్ష‌లు మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తున్నామ‌ని తెలిపారు మ‌రో 100 లింక్ రోడ్ల‌ను అభివృద్ధి చేయ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తం 137లింక్ రోడ్ల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి పాత ముంబై రోడ్డు లెద‌ర్ పార్క్ వ‌ర‌కు నిర్మించిన లింక్ రోడ్డును ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వీయూసీ బ్రిడ్జి నిర్మాణానికి కూడా శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రుల స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ఒక‌టి అని తెలిపారు. అత్యుత్త‌మ జీవ‌న ప్ర‌మాణాలు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని ప‌లు సంస్థ‌లు ఇప్పటికే వెల్ల‌డించారు. ఆక‌ర్ష‌ణీయ నగ‌రంగా రూపుదిద్దుకుంటుంది. ప‌ట్ట‌ణీక‌ర‌ణ కూడా వేగంగా పెరుగుతుంది. దీంతో మౌలిక వ‌స‌తులు పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. గ‌డిచిన‌6 సంవత్స‌రాలు మౌలిక వ‌స‌తుల‌ను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టులు చేప‌ట్టాం అని కేటీఆర్ వెల్ల‌డించారు. వేగంగా పెరుగుతున్న హైద‌రాబాద్ ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించ‌డంతోటు కాలుష్యాన్ని త‌గ్గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం ఈ క్ర‌మంలో మిస్సింగ్ రోడ్స్‌, లింక్ రోడ్స్‌ను ఏర్ప‌టు చేస్తున్నామ‌ని తెలిపారు. న‌గ‌రాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత నివాస‌యోగ్యంగా ఉంటుంద‌న్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి పాత ముంబై రోడ్డు లెద‌ర్ పార్క్ వ‌ర‌కు నిర్మించిన ఈ రోడ్డ‌ను ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే పూర్తి చేశామ‌న్నారు. దీన్ని నెక్లెస్ రోడ్డు మాదిరి డెవ‌ల‌ప్ చేయాల‌న్నారు. ఇదే ప‌ద్ధ‌తులో దుర్గం చెరువుతో పాటు చాలా చెరువుల‌ను జీహెచ్ఎంసీ ద్వారా అభివృద్ధి చేశామ‌న్నారు. న‌గ‌ర అభివృద్ది కి ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రం ఉంద‌న్నారు. లింక్ రోడ్ల విష‌యంలో ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు ,సూచ‌ల‌ను స్వీక‌రిస్తామ‌ని మంత్రి తెలిపారు. ఈ ర‌హ‌దారుల‌ను ప్రారంభించ‌డం ద్వారా ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *