మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు న‌గారా మోగింది…

హైద‌రాబాద్ః గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు న‌గారా మోగింది. మంగ‌ళ‌వారం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని మ‌స‌బ్‌ట్యాంక్‌లో 10:30 గంట‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌ధి షెడ్యూల్ విడుద‌ల చేశారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని 150 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌నుండ‌గా… బుధ‌వారం నుంచి మూడు రోజుల పాటు ఈనెల 20వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. 21న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, అదే రోజు అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌నున్నారు.24న ఉప‌సంహ‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తెలిపారు. ఉద‌యం ఏడు గంట‌ల నుంచి, సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని చెప్పారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వ‌హించి , ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. షెడ్యూల్ విడుద‌ల‌తో త‌క్ష‌ణ‌మే నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింద‌ని చెప్పారు.2016 రిజ‌ర్వేష‌న్ల‌తో ఎన్నిక‌లు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు బ్యాలెట్ ప‌ద్ధ‌తిలోనే జ‌రుగుతాయ‌ని పార్థ‌సార‌థి తెలిపారు. జీహెచ్ఎంసీ చ‌ట్ట ప్ర‌కారమే 150 వార్డుల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని, 2016 జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అమ‌లైన రిజ‌ర్వేష‌న్లే ఇప్పుడూ కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల కేటాయింపులు అనేది ప్ర‌భుత్వ వ్య‌వ‌హార‌మ‌ని ,అసెంబ్లీ ఓట‌ర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. 2020 జ‌న‌వ‌రి1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హుల‌ని వివ‌రించారు. బ‌ల్దియా ప‌రిధిలో ఉన్న ఓట‌ర్ల‌లో 52.09 బ‌ల్దియా ప‌రిధిలోని ఉన్న ఓట‌ర్ల‌లో 52.09 శాతం పురుషులు, 47.90 శాతం మ‌హిళ‌లు ఉన్నార‌ని వివ‌రించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓట‌ర్లున్నార‌ని వెల్ల‌డించారు. మైలార్‌దేవ్‌ప‌ల్లిలో అత్య‌ధికంగా 79.290 మంది, రామ‌చంద్రాపురంలో అత్య‌ల్పంగా27,997 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని తెలిపారు. ఎన్నిక‌ల ఏర్పాట్ల ప్ర‌క్రియ‌ను కావాల్సిన అన్ని ప‌నులు పూర్తి చేసిన‌ట్లు చెప్పారు. మేయ‌ర్ జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించిన‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌ధి చెప్పారు. రెండు వార్డులు ఎస్టీలు, 10 వార్డులు ఎస్సీల‌కు,50 బీసీల‌కు, జ‌న‌ర‌ల్ మహిళ 44, మ‌రో 44 స్థానాలు జ‌న‌ర‌ల్‌కు రిజ‌ర్వు చేసిన‌ట్లు వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *