డేటా సెంట‌ర్ ప్రారంభోత్స‌వం….

హైద‌రాబాద్ః గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. డేటా సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి , మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, హైద‌రాబాద్ ,సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఏక‌కాలంలో భారీ తెర‌పై ఐదు వేల సీసీ కెమెరాల దృశ్యాల‌ను వీక్షించే అవ‌కాశం ఉంది. 10ల‌క్ష‌ల కెమెరాల‌కు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజుల పాటు నిక్షిప్తం చేసేలా భారీ స‌ర్వ‌ర్లు ఏర్పాట్లు చేశారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్లో 14 మీట‌ర్ల పొడ‌వు, 42మీట‌ర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర‌, దాని ప‌క్క‌నే రెండు వైపులా55 అంగుళాల సామ‌ర్థ్యం గ‌ల మ‌రో నాలుగు టీవీ తెర‌లు ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌లోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలోని సీసీ కెమెరాల దృశ్యాల‌ను ఇక్క‌డ నుంచి వీక్షించ‌వ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *