టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించారు…

హైద‌రాబాద్ ః ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమ‌తుల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ‌వ‌న‌రుల సంస్థ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వెబ్‌సైట్ ను ఆవిష్క‌రించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ నేటి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో భ‌వ‌న నిర్మాణం, లే అవుట్లకు సుల‌భ‌త‌రంగా ,వేగంగా అనుమ‌తులివ్వ‌డం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్ర‌భుత్వం రూపొందించిది. ద‌ర‌ఖాస్తుదారు స్వీయధ్రువీక‌ర‌న‌తో భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తి ఇస్తారు. నిర్ధేశించిన గ‌డుపులోగా అనుమ‌తులు, ధ్రువ‌ప‌త్రాల‌ను జారీచేయ‌నున్నారు. 75గ‌జాల స్థ‌లంలో నిర్మించుకునే భ‌వ‌నాల‌కు ఎలాంటి అనుమ‌తులు అవ‌స‌రం ఉండ‌డు.600గ‌జాల లోపు ఇండ్ల‌కు, 100 మీటర్ల కంటే త‌క్కువ ఎత్తుండే గృహాల‌కు స్వీయ‌ధ్రువీక‌ర‌ణ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే అనుమ‌తిస్తారు. ఈ భ‌వ‌నాల నిర్మాణాలకు21 రోజుల్లో అనుమతులు జారీచేస్తారు. ఈ వెబ్‌సైట్ తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాష‌ల్లో అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *