రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారు తలైవా

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారు తలైవా. రజినీ ఇటీవల చెన్నైలో 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం తన రాజకీయ అరంగేట్రం, పార్టీ ఏర్పాటు గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ పేరు తదితర విషయాలు ప్రకటించనున్నారు. జనవరిలో పార్టీని ప్రారంభిచనున్నట్లు రజినీ కాంత్ వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడులో ఉన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.