ప్ర‌పంచంలోనే అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన పోటీ..

The, most, interesting, competition, in, the, world ..క‌రోనా కార‌ణంగా స్టేడియాల్లో మ్యాచ్‌ల‌ను వీక్షించే అవ‌కాశాన్ని కోల్పోయిన అభిమానులు తిర‌గి క్రికెట్ సంద‌డిని నేరుగా ఆస్వాదించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.భార‌త్ మ‌రియు ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గ‌నున్న వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు టికెట్ల‌ను విక్ర‌యించ‌గా హాట్‌కేకుల్లా అమ్ముడ‌య్యాయి. ఆన్‌లైన్‌లో మూడు వ‌న్డేలు, మూడు టీ20ల టికెట్ల‌ను ఉంచ‌గా 24 గంట‌ల‌లోనే దాదాపు అన్నీ అమ్ముడుపోయాయి. తొలి వ‌న్డేకు మాత్రం 2వేల టికెట్లు మిగిలాయి. మ‌హమ్మ‌రి కార‌ణంగా స్తంభించిన క్రికెట్ జూలైలో తిరిగి ఆరంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌డం భార‌త్‌, ఆస్ట్రేలియా తొలి వ‌న్డేతోనే షురూ కానుంది. కాగా, కొవిడ్‌19 జాగ్ర‌త్త‌ల నేప‌థ్యంలో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం స్ట్రేడియంలో 50 శాతం సామ‌ర్థ్యంతో అభిమానుల‌కు అనుమ‌తిచ్చింది. భార‌త్ మ‌రియు ఆస్ట్రేలియా మ‌ధ్య మ్యాచ్ అంటే ప్ర‌పంచంలోనే అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన పోటీ. ఈ సిరీస్ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ఆశిస్తున్నా అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌తినిధి ఆంథోని తెలిపారు. ఆస్ట్రేలియా సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ 20లు, నాలుగు టెస్టులు ఆడ‌నుంది. వైట్ బాల్ క్రికెట్ సిరీస్ లు సిడ్నీ, కాన్ బెర్రాలో జ‌ర‌గ‌నున‌న్నాయి. సిడ్నీ వేదిక‌గా న‌వంబ‌ర్ 27న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *