ర‌జీనీ పార్టీకి ఆటో గుర్తును ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఖ‌రారు.

హైద‌రాబాద్ః రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీ ఏర్పాటు ప‌నుల‌ను వేగ‌వంతం చేశారు. ఈ నెల 31 న పార్టీ పేరును ప్ర‌క‌టిస్తాన‌ని తెలిసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు కొత్త‌పార్టీకీ చీఫ్ కోఆర్డినేట‌ర్‌గా అర్జున మూర్తిని, సూప‌ర్ వైజ‌ర్‌గా త‌మిళ్రూవి మ‌ణియ‌న‌ణ్‌ను నియ‌మించుకున్నారు. కాగా, పార్టీ పేరు, జెండా ,ఇత‌ర విష‌యాల‌పై కొద్ది రోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. గ‌తవారంలో ముఖ్య నేత‌ల‌తోనూ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఈ నెలాఖ‌రున ప్ర‌క‌టించే పేరు, గుర్తు పేరు దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఖ‌రారు. చేసిన‌ట్లుగా తెలుస్తోంది. రాజ‌నీకాంత్ న‌టించిన భాషా మూవీలో ఆటో డ్రైవ‌ర్‌గా క‌నిపించారు.ఈ మూవీతో దేశ‌వ్యాప్తంగా ఆయ‌న‌కు ఎంతో గుర్తింపు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఎన్నిక‌ల గుర్తుగా ఆటోను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మిళ‌నాడులోని 234 నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌జీనీకాంత్ పార్టీ మ‌క్క‌ల్‌సేవై క‌ర్చీ పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం . అంత‌కుముందు ర‌జీనీ బాబా లోగోను కోరగా దాన్ని కేటాయించేందుకు ఎన్నిక‌ల సంఘం నిరాక‌రించింది. కాగా, పార్టీ పేరు, జెండా, ఇత‌ర విష‌యాల‌ను ఈ నెలాఖ‌రున రాజ‌నీకాంత్ స్వ‌యంగా వెల్ల‌డించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *