తెలంగాణ మొద‌టి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి…

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ హిమా కోహ్లీ ప్ర‌మాణ ‌స్వీకారం చేశారు.రాజ్‌భ‌వ‌న్ లో జ‌స్టిస్ హిమా కోహ్లీ చేత గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైసౌంద‌ర్‌రాజ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌రావు ముఖ్యఅతిథిగా హాజ‌రుకాగా ,శాస‌న‌స‌భ స్వీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి,మండ‌లిఛైగుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీ ల‌తోపాటు హైకోర్టు న్యాయ‌మూర్తులు హాజ‌ర‌య్యారు.ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం జ‌స్టిస్ హిమాకోహ్లీకి గ‌వ‌ర్న‌గిర్ త‌మిళ‌సై,ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుష్ఫ‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.
మొద‌టి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి
జ‌స్టిస్ హిమాకోహ్లీ తెలంగాణ హైకోర్టు మొద‌టి మ‌హిళాప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నిలించారు.1959సెప్టెంబ‌ర్‌
ఢిల్లీ లో పుట్టిన జ‌స్టిస్ హిమా కోహ్లీ1979 లో సెయింట్ స్టీఫెన్స్ క‌ళాశాల నుంచి బీఏ ఆన‌ర్స్ హిస్ట‌రీలో ప‌ట్ట‌భ‌ద్రుల‌య్యారు. త‌రువాత ఢిల్లీ యూనివ‌ర్సీటీ క్యాంప‌స్‌లా సెంట‌ర్ నుంచి న్యాయ‌శాస్త్రంలో ప‌ట్ట‌పొందారు.1984లో ఢిల్లీబార్ కౌన్సిల్‌లో స‌భ్యురాలిగా న‌మోదై..న్యాయ‌వాద వృతిని ప్రారంభించారు.
2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అద‌న‌పు జ‌డ్డిగా నియ‌మితుల‌య్యారు.సుమారు15నెల‌ల త‌రువాత పూర్తి స్థాయి జ‌డ్డిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కోవిడ్‌-19 విస్త‌ర‌ణ నేప‌థ్యంలో రాష్ట్రాలు,కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోని జైళ్ల‌లో ర‌ద్దీని తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్న‌త‌స్థాయి క‌మిటీకి హిమాకోహ్లీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితుల‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *