క‌ష్టా ల్లో టీమిండియా -హార్థిక్ పాండ్యాకూడా…

సిడ్నీ వేదిక‌గా టీమిండియా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టీమిండియా ఆర‌వ వికెట్‌ను కోల్పోయి పీక‌ల్లోతో క‌ష్టాల్లో ప‌డింది. టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ హార్థిక్ పాండ్యా, ధావ‌న్ చెప్పుకోద‌గిన భాగ‌స్వామ్యంతో ఆడి టీమిండియా గెలుపుపై ఆశ‌లు రేపారు.అయితే.. జంపా బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌గా చిక్కి ధావ‌న్ జౌట్ కావ‌డంతో టీమిండియా అభిమానులు నిరాశ చెందారు. ధావ‌న్ 86 బంతుల్లో 10 ఫోర్ల‌తో 74 ప‌రుగుల‌తో రాణించాడు. హార్థిక్ పాండ్యా కూడా అవ‌కాశం దొరికిన‌ప్పుడ్ల‌లా సిక్స్‌లు, ఫోర్ల‌తో వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. జంపా బౌలింగ్‌లో భారీ షాట్ కు య‌త్నించిన పాండ్యా 90 ప‌రుగుల వ్య‌క్త‌గ‌త స్కోర్ వ‌ద్ద స్టార్క్‌కుక్యాచ్‌గా చిక్కి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. వ‌న్డేల్లో తొలి సెంచ‌రీ న‌మోదు చేసే అవ‌కాశం పాండ్యాకు 10 ప‌రుగుల దూరంలో చేజారింది. 76 బంతుల్లో 4 సిక్స్‌లు, ఏడు ఫోర్ల‌తో 90 ప‌రుగులు చేసిన పాండ్యా ఆట‌తీరుపై ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం న‌వ‌దీప్ సైనీ, జ‌డేజా క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *