మూడో వ‌న్డేలో టీమిండియా విజ‌యం…

క్యాన్‌బెరాః ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో వ‌న్డేలో టీమిండియా విజ‌యం సాధించింది. తొలి రెండు వ‌న్డేల్లో దారుణంగా ఓడిన కోహ్లిసేన‌.. చివ‌రిదైన మూడో వ‌న్డేలో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఓదార్పు విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 13 ప‌రుగుల‌తో గెలిచి మూడు వ‌న్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి ప‌రిమితం చేయ‌గ‌లిగింది. చివ‌రి వ‌ర‌కు పోరాడిన ఆసీస్ 49.3 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగుల‌కు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో పాండ్యా, జ‌డేజా మెరుపులు.బౌలింగ్‌లో శార్దూల్ రాకూర్‌, న‌ట‌రాజ‌న్ రాణించ‌డంతో ఈ విజయం సాధ్య‌మైంది. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో మ‌రోసారి మ్యాక్స్‌వెల్ భ‌య‌పెట్టినా. కీల‌క‌మైన స‌మ‌యంలో అత‌న్ని
పెవిలియ‌న్‌కు పంపించి మ్యాచ్‌ను భార‌త్ వైపు మలుపుతిప్పాడు పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా. మ్యాక్స్‌వెల్ కేవ‌లం 38బంతుల్లో 3ఫోర్లు, 4సిక్స‌ర్ల‌తో 59 ప‌రుగులు చేశాడు. విజ‌యానికి మ‌రో 33 బంతుల్లో 35 పరుగులు అవ‌స‌ర‌మైన చేసి పోరాడినా..ఆసీస్ గ‌ట్టెక్క‌లేక‌పోయింది. అంత‌కుముందు కెప్టెన్ ఫించ్ త‌న అద్బుత‌మైన ఫామ్‌ను కొన‌సాగించాడు. 82 బంతుల్లో 75 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్‌3, బుమ్రా, న‌ట‌రాజ‌న్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.అంత‌కుముందు టాప్‌, మిడిలార్డ‌ర్ ఫెయిలైనా..చివ‌ర్లో ఆల్‌రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా చెల‌రేగ‌డంతో 50ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 302 ప‌రుగులు చేసింది. టీమిండియా అద్బుత‌మైన ఫామ్‌ను కొన‌సాగిస్తున్న పాండ్యా. ఈమ్యాచ్‌లోనూ కేవ‌లం 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా..జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేయ‌డం విశేషం.ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజెయంగా 150 ప‌రుగులు జోడించాడు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. మెల్ల‌గా మొద‌లుపెట్టి .. చివ‌ర్లో చెల‌రేగిపోయారు.బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు,1 సిక్స్ బాద‌గా,జ‌డేజా 5పోర్లు,3 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం.108 బంతుల్లో 150 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ అజేయంగా నిలిచారు. అంతుకుముందు ఓపెన‌ర్లు దావ‌న్ 16, శుభ్‌మ‌న్‌గిల్ 33, విఫ‌ల‌మైనా..కెప్టెన్ కోహ్లి63, హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిడిలార్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌19,రాహుల్ 5, కూడా నిరాశ‌ప‌రిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *