తొలి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విక్ట‌రీ సాధించింది….

హైద‌రాబాద్ః క్యాన్ బెరాలో జ‌రిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విక్ట‌రీ సాధించింది. ర‌స‌వ‌త్త‌రంగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 11 ర‌న్స్ తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. 162ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 150ర‌న్స్ చేసింది. బౌల‌ర్లు న‌ట‌రాజ‌న్‌, చాహాల్‌లు టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఆ ఇద్ద‌రూ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.జ‌డేజాకు గాయం కావ‌డంతో కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ గా బ‌రిలోకి దిగిన చాహ‌ల్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 161 రన్స్ చేసింది. ఆత‌రువాత ఫీల్డింగ్‌లోనూ భార‌త్ త‌న స‌త్తా చాటింది. వాస్త‌వానికి చేజింగ్‌నుఆస్ట్రేలియా ధాటిగా ప్రారంభించినా చాహాల్ ,న‌ట‌రాజ‌న్‌లు కీల‌క ద‌శ‌ల్లో వికెట్లు తీశారు. ర‌వీంద్ర జ‌డేజా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించ‌గా అత‌ని స్థానంలో స‌బ్‌స్టిట్యూట్ గా వ‌చ్చి బౌలింగ్ వేసిన చాహాల్ కూడా రాణించ‌డం విశేషం. ఇటీవ‌ల ముగిసిన వ‌న్డే సిరీస్‌ను 2-1 తేడాతో భార‌త్ కోల్పోయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *