ఇంత తెలివిగ‌ల రైతులు భార‌త‌దేశానికి సొంతం..

Such, intelligent, farmers, belong, to ,India రైతుకు ఎడ్ల బండి ఎంత ముఖ్య‌మో… ఆ ఎడ్ల‌తోను బండితోను అంత అనుబంధం ఉంటుంంది. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పంట‌ను పండించే రైత‌న్న ఒకేసారి ఎడ్ల‌బండిని కారుని కూడా ఎక్కేశాడు. ఒకేసారి అని ఎందుకు అనాల్సివ‌చ్చిందో ఈ ఫోటోను ..ఈవీడియోను చూస్తే అర్థం అయిపోతుంది. ఇది చూసిన‌వెంట‌నే క‌చ్చితంగా ఆరైతు వినూత్న ఆలోచ‌న‌కు నోరెళ్ల‌బెట్టాల్సిందే. హేయ్‌.. హేయ్ … అంటూ ఎద్దుల‌ను అదిలిస్తూ కారులో వెళితూ ఎడ్ల‌ను అదిలించిన‌ట్లుగా అన‌ట‌మేంటీ? అనుకోవ‌చ్చు. అదేమ‌ని ఈ రైతు తెలివి. ఆయ‌న‌గారీ వింత బండి రోడ్డుమీద వెళుతుంటే అంద‌రూ ఔరా… ఏమిటిది అంటూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ రైతు ఎవ‌రో గానీ .. కారుకు ఎద్దుల బండిని క‌ట్టాడు. కారు వెనుక భాగాన్ని ఎద్దుల‌కు ద‌ర్జాడా ఎద్దుల కారులో వెళుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. సగం కారులాగా ఉన్న ఈ బండిని రోడ్ల‌పై న‌డుపుతూ రైతు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నారు. ఈబండిని చూసిన వారంతా ఆశ్చ‌ర్య‌పో తున్నారు. భ‌లే భ‌లే ఆలోచ‌న అంటూ అభినందిస్తున్నారు. ఇంత తెలివిగ‌ల రైతులు భార‌త‌దేశానికి సొంతం అని తెగ పొగిడేస్తున్నారు. ఈ వినూత్న‌మైన బండిని వీడియోను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హేంద్ర సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అది కారెడ్ల బండి వీడియో వైర‌ల్గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *