అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన వికెట్ కీప‌ర్‌గా రికార్డు..

ముంబైః టీమిండియా వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించాడు.35 ఏళ్ల పార్థివ్‌.టీమిండియా త‌ర‌పున 25 టెస్టులు ,38వ‌వ‌న్డేలు, 2టీ20లు ఆడాడు. దేశ‌వాళీ క్రికెట్లో గుజ‌రాత్ త‌ర‌పున 194 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్ లు ఆడిన పార్థివ్‌.బుధ‌వారం ట్విట‌ర్ వేదిక‌గా త‌న రిటైర్మెంట్ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ18ఏళ్ల త‌న కెరీర్‌లోత‌న‌కు స‌హ‌క‌రించిన బీసీసీఐ, అంద‌రు కెప్టెన్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ట్విట‌ర్‌లో ఓ లేఖ‌ను పోస్ట్ చేశాడు. 2002 లో తొలిసారి ఇండియ‌న్ టీమ్ త‌ర‌పున ఆడిన పార్థిన్‌..టెస్టులో అత్యంత పిన్న వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన వికెట్ కీప‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఇండియ‌న్ టీమ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని వ‌య‌సు 17ఏళ్ల 153 రోజులు. మొద‌ట్లో అత‌ను ప‌ర్వాలేద‌నిపించినా..దినేష్ కార్తీక్‌, ఎమ్మెస్ ధోనీ రాక‌తో క్ర‌మంగా టీమ్‌లో స్థానంలో కోల్పోయాడు.2004లో తొలిసారి టీమ్ లో స్థానం కోల్పోయిన పార్థివ్ త‌రువాత మ‌రోసారి అవ‌కాశం వ‌చ్చినా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ఐపీఎల్ లో అత‌డు రాయ‌ల్
చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ త‌ర‌పున ఆడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *