పోల‌వ‌రాన్ని కావాల‌నే వివాదంలోకి నెడుతున్నారు…..

అమ‌రావ‌తిః ప్ర‌స్తుతం పోల‌వరం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం తీరు చూస్తుంటే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయ‌డు అన్నారు. మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ చేసిన వ్యాఖ్యాల‌పై స్పందించిన ఆయ‌న మాట్లాడుతూ పోల‌వ‌రంపై టెండ‌ర్ల‌ను త‌న హాయాంలో పిల‌వ‌లేద‌ని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌నులు మొద‌ల‌య్యాయ‌న్నారు. 2013 ముగిసే నాటికి టెండ‌ర్లు ఇచ్చార‌ని, టెండ‌ర్ల‌ను మేము పిల‌వ‌లేదని చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. 7ముంపు మండ‌లాలు తీసుకురాక‌పోయి ఉంటే అస‌లు ప్రాజెక్టు ఉండేది కాద‌న్నారు. పోల‌వ‌రం టెండ‌ర్ల‌ను వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రీక్లోజ‌ర్ చేశార‌ని, ఆ త‌రువాత కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ‌చ్చే వ‌కు ఫైన‌ల్ చేయ‌లేద‌ని తెలిపారు. వైసీపీ ప్ర‌భుత్వం పోల‌వ‌రాన్ని కావాల‌నే వివాదంలోకి నెడుతోంద‌న్నారు. మీరు త‌వ్విన గోతిలో మీరే ప‌డే ప‌రిస్థితి వచ్చింద‌ని చంద్ర‌బాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *