నారా రోహిత్ రైతులకు సంఘీభావాన్ని తెలిపారు…

అమ‌రావ‌తిః అమ‌రావ‌తి రైతుల స్ఫూర్తిదాయ‌క పోరాటానికి ఏడాది గ‌డిచిన సంద‌ర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ సంఘీభావాన్ని ప్ర‌క‌టించాడు. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు ప్రారంభించిన పోరాటానికి ఏడాది పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా నారా రోహిత్ ట్విట‌ర్ ద్వారా స్పందించాడు. క‌డుపు నింపే రైత‌న్న‌లు ఆనాడు రాష్ట్రం కోసం త్యాగం చేసినా అదే ప‌ట్టుద‌ల‌, ఇప్పుడు ఆ త్యాగాన్ని అవ‌హేళ‌న చేస్తూ ప్ర‌జారాజ‌ధానిని నామరూపాలు లేకుండా చెయ్యాల‌ని చూస్తున్న వారితో పోరాడినా అదే ప‌ట్టుద‌ల‌. రైత‌న్నల స్పూర్తిదాయ‌క పోరాటానికి ఏడాది పూర్తైన సంద‌ర్భంగా నా సంఘీభావం తెలుపుతున్నును.జై అమ‌రావ‌తి, అని రోహిత్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *