కొత్త టీమ్ కోసం మోహ‌న్‌లాల్ మ‌రియు స‌ల్మాన్ ఖాన్ పోటిప‌డుతున్నార‌ట‌…

ముంబైః వ‌చ్చే సంవత్స‌రం ఐపీఎల్ లోకి రెండు కొత్త టీమ్స్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు డిసెంబ‌ర్‌24 న జ‌ర‌గ‌బోయే వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో బీసీసీఐ దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోనుంది. ఈ స‌మావేశం కోసం 23 పాయింట్ల‌తో ఎజెండాను కూడా బోర్డు సిద్ధంగా చేసింది. 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌డం ద్వారా వ‌చ్చిన న‌ష్టాన్ని ఈ కొత్త టీమ్స్‌తో రాబ‌ట్టుకోవాన్న‌ది బీసీసీఐ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ కొత్త టీమ్స్ కోసం పూర్తి స్థాయి వేలానికి సిద్ధంగా ఉండాల‌ని అన్ని ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ సందేశం పంపించారు.వ‌చ్చే ఏడాది మొద‌ట్లోనే ఈ వేలం ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఐపీఎల్ లోకి వ‌చ్చి ఆ జ‌ట్టు ఏవి అన్ని దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో ఒక‌టీమ్ ఖ‌చ్చితంగా అహ్మాదాబాద్ నుంచి ఉంటుంద‌ని ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా మారిన మొతెరానే ఈ టీమ్‌కు హోమ్ గ్రాండ్‌గా ఉంటుంద‌నీ ఆ వార్త‌లు తేల్చేశాయి. మ‌రో వైపు కొత్త టీమ్ కోసం మోహ‌న్‌లాల్‌, స‌ల్మాన్‌ఖాన్ కూడా పోటి ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *