రికార్డును తిర‌గ‌రాసిన జ‌డేజా-పాండ్యా…

హైద‌రాబాద్ః ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డేలో టీమిండియా విజ‌యం సాధించింది. ఈ విజ‌యానికి ముఖ్య కార‌ణం ఆల్‌రౌండర్లు ర‌వీంద్ర జ‌డేజా, హార్ధ‌క్ పాండ్యా అని చెప్పొచ్చు. వీరిద్ద‌రూ త‌మ స‌త్తా చాటుకున్నారు. జ‌ట్టులో వారు ఎందుకు ఉండాలో ఈ మ్యాచ్‌లో నిరూపించుకున్నారు.152 ప‌రుగుల వ‌ద్ద 5 వికెట్ లో కోల్సోయి తీవ్ర క‌ష్టాల‌లో ప‌డ్డ టీమిండియా ఒక ద‌శ‌లో250 ప‌రుగులు చేస్తుందా అన్న అనుమానం క‌లిగింది. ఈ మ్యాచ్ హార్ధిక్ పాండ్యా మ‌రో దుమ్మురేపే ప్ర‌య‌త్నన‌తో ఆక‌ట్టుకున్నాడు 76బంతుల్లోనే 7 ఫోర్లు,1 సిక్స్‌తో 92 ప‌రుగులు చేశాడు. పాండ్యాకు వ‌న్డేలో తొలి సెంచ‌రీ చేసే అవ‌కాశం వ‌చ్చినా ఆఖ‌ర్లో జ‌డేజాకు ఎక్క‌వ‌గా స్ట్రే ఇచ్చాడు. మ‌రో వైపు 32 ఓవ‌ర్లులో ప్యాండ్యాకు జ‌త క‌లిసిన జ‌డేజా కూడా య‌దేచ్చ‌గా బ్యాట్ ఝులింపించాడు. 50బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్స‌ర్ల‌తో 66 ప‌రుగులు డుకున్నాడు.ఆ త‌రువాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా289 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 13 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ కొట్టింది. కోహ్లీ సేన‌. మూడు వ‌న్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *