ఇస్రో మాన‌వ స‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగం గ‌గ‌న్‌యాన్ వాయిదా..

బెంగ‌ళూరుః ఇస్రో మాన‌వ స‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగం గ‌గ‌న్‌యాన్ వాయిదా ప‌డింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ప్ర‌తికూల ప్ర‌భావం కార‌ణంగా ఏడాది పాటు వాయిదా వేస్తున్న‌ట్లు ఇస్రో చైర్మ‌న్ కే శివ‌న్ తెలిపారు. మిష‌న్‌ను ఈ ఏడాది డిసెంబ‌ర్,జూలై 2021లో ప్రారంభించాల‌ని షెడ్యూల్ నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది చివ‌రిలో ,2022 లో ఏప్పుడైనా మిష‌న్‌ను ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. గ‌గ‌న్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమోగాములు లో ఎర్త్ ఆర్బిట్ (LEC) కు వెళ్లి తిరిగి సుర‌క్షితంగా భూమికి చేర‌డం ప్రాజెక్టు లక్ష్యం.మాన‌వ‌ర‌హిత అంత‌రిక్ష మిష‌న్ కోసం పూర్తిస్థాయి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో ఓ రోబోను రూపొందించాల‌ని ఇస్రో ఇప్ప‌టికే ప్ర‌ణాళిక రూపొందించింది. ప్ర‌ముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ ఈ ప్ర‌యోగానికి సంబంధించి మొద‌టి హార్ట్‌వేర్ బూస్ట‌ర్ విభాగాన్ని త‌యారు చేసింది. ప్ర‌పంచంలోని మూడో అతిపెద్ద ఘ‌న చోద‌క రాకెట్ బూస్ట‌ర్ మ‌ధ్య ఎస్‌-200ను అనుకున్న షెడ్యూల్ క‌న్నా ముందుగానే అంద‌జేసింది.3.2మీట‌ర్ల వ్యాసం,8.5మీట‌ర్ల పొడ‌వు, 5.5ట‌న్నుల బ‌రువు ఉన్న ఈ బూస్ట‌ర్‌ను మాన‌వ‌స‌హిత ప్ర‌యోగంలో ఉప‌యోగించ‌నున్నారు. మాన‌వ -రేటెడ్ GSLV MKIII లో హైథ్ర‌స్ట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ స్ట్రాప్‌- ఆన్ బూస్ట‌ర్ S200 ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుంది. అలాగే ల్యాండ‌ర్ ,రోవ‌ర్ల‌తో కూడిన చంద్ర‌యాన్ మిష‌న్‌-3 ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయ‌ని ఇస్రో చైర్మ‌న్ తెలిపారు. ఇంకా షెడ్యూల్‌ను నియంత్రించ‌లేద‌ని పేర్కొన్నారు. వీన‌స్ మిష‌న్ శుక్ర‌యాన్‌పై ఇంకా పేలోడ్‌ల‌ను ఖ‌రారు. చేయ‌లేద‌ని, ఈ ప్రాజెక్టు ప‌నులు సాగుతున్నాయ‌ని చెప్పారు. ఇస్రో 2023జూన్ వ‌ర‌కు వీన‌స్ మిష‌న్ చేప‌ట్ట‌నుంది. అయితే మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఆల‌స్య‌మ‌వుతోంద‌ని, ప్ర‌స్తుతం మిష‌న్ టైమ్‌లైన్‌ను స‌మీక్షిస్తున్న‌ట్లు ఇస్రో అధికారి ఒక‌రు తెలిపారు. భ‌విష్య‌త్ ప్ర‌యోగ అవ‌కాశం 2024 -2026 ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *