అమ‌రావ‌తి ముఖ్య‌మా? పోల‌వరం ముఖ్య‌మా?

అమ‌రావ‌తిః ఏపీ శాస‌న‌మండ‌లిలో రాజ‌ధాని అమ‌రావ‌తి పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని టీడీపీ స‌భ్యులు ప‌ట్ట‌ప‌ట్టారు.అయితే అధికార‌పార్టీ స‌భ్య‌లు మాత్రం పోల‌వరంపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని కోరారు. ఈ నేప‌ధ్యంలోఅధికార‌, ప్ర‌త‌ప‌క్ష స‌భ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం జ‌రిగింది. అయితే డిప్యూటీ స్పీక‌ర్ మాట్లాడుతూ ముందు అమ‌రావ‌తిపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని, త‌రువాత పోల‌వ‌రంపై చ‌ర్చిద్దామ‌ని అన్నారు. అయితే మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ పోల‌వ‌రం ముఖ్య‌మా? అమ‌రావ‌తి ముఖ్య‌మా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి జీవ‌నాడి అయిన పోల‌వ‌రంపై చ‌ర్చించ‌కుండా కేవ‌లం 28 గ్రామాల‌కు సంబంధించిన అంశంపై చ‌ర్చించ‌డం స‌రికాద‌ని నిల‌దీశారు.అయితే పోల‌వ‌రంపై నిన్న‌నే చ‌ర్చ పెడ‌తామ‌ని అన్నార‌ని ఇవాళ కూడా జ‌రుగుతుందా లేదా అని ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *