కొత్త‌జ‌ట్టు రేసులో అదానీ, గోయెంకా,మోహ‌న్‌లాల్‌… మెగా వేలం ఎప్పుడంటే…

హైద‌రాబాద్్‌విప‌త్క‌ర ప‌రిస్థితుల న‌డుమ దుబాయ్ వేదిక‌గా ఐపీఎల్‌2020 సీజ‌న్‌ను నిర్వ‌హించ‌డంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి(బీసీసీఐ) గ్రాండ్స్‌స‌క్సెస్ అయింది. లీగ్ ఆరంభానికి ముందు క‌రోనాక‌ల‌వ‌ర పెట్టినా… ఆత‌రువాత అంతా సాఫీగా సాగిపోయింది. ఢిల్లీతో జ‌రిగిన తుది పోరులోనెగ్గిన ముంబై ఇండియ‌న్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఈ విజ‌యోత్సాహంతో వ‌చ్చే ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ స‌న్న‌ద్ద‌మ‌వుతుంది. ఐపీఎల్ బ్రాండ్ విలువ‌ను మ‌రింత పెంచేందుకు లీగ్‌లో తొమ్మిదో జ‌ట్టుకు చోటు క‌ల్పించాల‌ని బీసీసీఐ దాదాపు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది.ఈనేప‌థ్యంలో కొత్త ఫ్రాంచైజీని ఎవ‌రు ద‌క్కించుకుంటార‌నే విష‌య‌మై చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి.ల‌క్నో, కాన్పూర్,పుణే సిటీల పేర్లూ వినిపిస్తున్నా.. ఏదైనా అనూహ్య ప‌రిమాణాలు సంభ‌విస్తే త‌ప్ప కాబోయేకొత్త ఫ్రాంచైజీ అహ్మ‌దాబాద్ అనేది దాదాపుఖాయమే. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కూడా బ‌రీలో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ద‌క్ష‌ణాదికి చెందిన బైజూస్ సంస్థ‌తో క‌లిసి ఆయ‌న రేసులో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దుబాయ్‌లో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్‌కు హాజ‌ర‌ప‌డం.. బీసీసీఐ అధికారులతో మోహ‌న్‌లాల్ స‌న్నిహితంగా మెల‌గ‌డం.. లీగ్‌లో జ‌ట్టును కొనుగోలు చేసే ప్ర‌యాత్నల్లో ఆయ‌న ఉన్నార‌న్న వార్త‌ల‌కు బ‌లం చేకూర్చింది. అలాగే కేర‌ళ‌కు చెందిన ఓ రిపోర్ట‌ర్ మోహ‌న్ లాల్ కొత్త టీమ్ కొనుగోలు చేయ‌నున్నాడ‌ని ట్వీట్ చేయ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లు కొత్త జ‌ట్టు ఆలోచ‌న గురించే బీసీసీఐ ఇంకా అధికారంగాప్ర‌క‌టించ‌లేదు.ఈ ఆలోచ‌న‌ను బోర్డు అమ‌లు చేయాలంటే..2021సీజ‌న్ మెగా వేలానికి కూడా బీసీసీఐస‌న్న‌ద్ధం కావాల్సిఉంటుంది.కొత్త జ‌ట్టుతోపాటు పూర్తిస్థాయి వేలానికి సంబంధించి డిసెంబ‌ర్ రెండో వారంలో నిర్ణ‌యం తీసుకోన్నుట్టు ప్ర‌స్తుత ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ ఇప్ప‌టికే స‌మాచారం అందించిన‌ట్లు తెలుస్తోంది.సమ‌యం త‌క్కువ‌గానే ఉంది.కానీ లీగ్‌లోని అంద‌రి ప్ర‌యోజ‌నాలు ప‌రిణ‌న‌లోకి తీసుకొని మెగా వేలానికి వెళ్లాల్సిఉంటుంది. అని బోర్డుఅధికారి ఒక‌రు తెలిపారు.అనుకున్న‌ది.అనుకున్న‌ట్టు జ‌రిగితే డిసెంబ‌రు చివ‌రి వారం లేదా జ‌న‌వ‌రిలో మెగా వేలం జ‌రిగే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *