వ్యాక్సిన్ పంపిణీ లో ఇత‌ర దేశ‌ల‌తో పోలీస్తే భ‌ర‌త్ మెరుగైన స్థానం..

హైద‌రాబాద్ః గ‌త కొన్నినెల‌లుగా క‌రోనా వైర‌స్‌తో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుత‌న్నార‌ని క‌రోనా వైర‌స్‌పై అఖిల‌ప‌క్ష మావేశంలో వీడియో కాన్ప‌రెన్సింగ్ ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ త‌యారీలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విశ్వాసంతో ఉన్నట్టు వెల్ల‌డించారు. అత్యంత చౌకైన‌, సుర‌క్షిత‌మైన టీకాపై ప్ర‌పంచ దృష్టి పెట్టింద‌ని, అందుకే అంద‌రూ ఇండియా వైపు ఆశ‌గా చూస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఉన్న విప‌క్ష నేత‌ల‌తోవ‌ర్చువ‌ల్ మీటింగ్‌లో మాట్లాడిన మోడీ వ‌చ్చే కొన్ని వారాల్లో క‌రోనా టీకా వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. శాస్త్ర‌వేత్తులు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన వెంట‌నే భార‌త్ లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మొద‌ల‌వుతుంద‌ని, హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు, వృద్దుల‌కు మొద‌ట క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌బ‌డుతుంది. అని చెప్పారు. ప్ర‌ధాని, వ్యాధి కార‌ణంగా తీవ్రంగా బాధ‌ప‌డేవారికి తొలుత టీకా ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ ధ‌ర విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ బృందాలు క‌లిసి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయ‌ని, వ్యాక్సిన్ పంపిణీలోఇత‌ర దేశ‌ల‌తోపోలీస్తే భార‌త్ మెరుగైన స్తానంలో ఉంటుంద‌ని అన్నారు. వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌లో భార‌త్కు విస్తృత‌మైన నెట్వ‌ర్క్ అనుభ‌వం ఉంద‌ని, కోవిడ్ పై అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ సూచ‌న‌ల‌ను లిఖిత‌పూర్వంగా ఇవ్వాల‌ని ప్ర‌ధాని కోరారు. దేశియంగా 8 వ్యాక్సిన్లు వివిధ ద‌శ‌ల‌లో ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోడీ చెప్పారు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *