నేను ఇప్పుడే వింటున్నా…

హైదరాబాద్ః ఐపీఎల్ ఫ్రాంఛెజీ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ కేన్ విలియ‌మ్స‌న్ జ‌ట్టును వీడుతున్న‌ట్లు వ‌చ్చిన పుకార్ల‌ను ఆ జ‌ట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ కొట్టిపారేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియ‌మ్స‌న్ ఐపీఎల్‌లో మ‌రో జ‌ట్టును మార‌నున్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ద్వారా విలియ‌మ్స‌న్ ఐపీఎల్‌లో ఇంకో జ‌ట్టులోకి వెళ్తున్నాడా? ఇది నిజామేనా?దీనిపై క్లారిటీ ఇవ్వాల‌ని ఓ నెటిజ‌న్ వార్న‌ర్‌ను ట్విట‌ర్లో కోరాడు. ఈ విష‌యాన్ని నేను ఇప్పుడే వింటున్నా .కేన్ ఎక్క‌డికీ వెళ్ల‌డు అంటూ వార్న‌ర్ స‌మాధాన‌మిచ్చాడు. ఐపీఎల్ 2020 లో వార్న‌ర్‌, కేన్ నిల‌క‌డ‌గా రాణించారు. హైద‌రాబాద్ టీమ్‌14 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫ‌య‌ర్‌-2 ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *