కేంద్రానికి నిబద్ధత‌,చిత్త‌శుద్ది ఉంటే పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్నారు..

హైద‌రాబాద్ః ల‌కారం ట్యాంక్‌బండ్‌పై మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కాంస్య విగ్ర‌హాన్ని రాష్ట్ర ఐటి, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ సోమ‌వారం ఆవిష్క‌రించారు. రూ.1.25 కోట్ల‌తో పీవీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో కోరుతున్నార‌ని తెలిపారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వ‌డమంటే కేంద్రం త‌న‌ను తాను గౌర‌వించుకోవ‌డ‌మే అని చెప్పారు. కేంద్రానికి నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ది ఉంటే పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాల‌న్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పీవీ కాంస్య విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. హైద‌రాబాద్ సెంట్ర‌ల్‌వ‌ర్సిటీకి పీవీ పేరు పెట్టాల‌ని కేంద్రాన్ని కోరిన‌టట్లు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పీవీ శ‌త‌జ‌యంతి సంక‌ల‌నాన్ని కేటీఆర్ ఆవిష్క‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *