భార‌త్ బంద్‌కు 8న రైతుల పిలుపు…

న్యూఢిల్లీః కేంద్రం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న‌గా రైతులు త‌మ ఆందోళ‌న‌ను తీవ్ర త‌రం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా ఈనెల 8వ భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం, గురువారం కేంద్ర ప్ర‌భుత్వంతో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. శ‌నివారం మ‌రోసారి రైతుల సంఘాల నేత‌ల‌తో స‌మావేశం కానున్న‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ గురువారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శ‌నివారం జ‌రిగే చ‌ర్చ‌ల‌కు ముందు సింఘు బోర్డ‌ర్‌లో రైతు సంఘాల నాయ‌కులు శుక్ర‌వారం విలేక‌రుల‌తోమాట్లాడారు. కేంద్రం తీసుకువ‌చ్చిన మూడు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేన‌న్నారు. ఈ నెల 5న కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని, ప్ర‌ధాని ,కేంద్రం దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హానం చేయాల‌ని భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బీకేయూ-ల‌ఖోవాల్‌) ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి హెచ్ ఎస్ ల‌ఖోవాల్ రైతుల‌ను కోరారు. అఖిల భార‌త కిసాన్ స‌భ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌న్న‌న్ మొల్లా మాట్లాడుతూ నిర‌స‌నల‌ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కేంద్రం చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో రైతులు తొమ్మిదో రోజు నిర‌స‌న‌లు కొన‌సాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *