మైదానంలో మీ శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించండి….

న్యూఢిల్లీ ః టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగ‌ళ‌వారం ఉద‌యం ఆస్ట్రేలియా నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరాడు. మిగ‌తా మూడు టెస్టుల‌కు జ‌ట్టు సార‌థ్య‌బాధ్య‌త‌ల‌ను ఆజింక్య ర‌హేనేకు అప్ప‌గించాడు. కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ త్వ‌ర‌లో బిడ్డ‌కుజ‌న్మ‌న్విబోతున్న నేప‌థ్యంలో విరాట్ పెట‌ర్నిటీలీవ్ తీసుకున్నాడు. తాను వెళ్లిపోతున్నాన‌ని , మీ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆట‌గాళ్ల‌తో ఉత్సాహం నింపాడు. కోహ్లీ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ భాగంగా తొలి మ్యాచ్‌లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలైన నేప‌థ్యంలో జ‌ట్టు స‌భ్యుల‌తో కోహ్లీ స‌మావేశ‌మ‌య్యాడు. ఆట‌గాళ్ల మ‌నోధైర్యాన్ని పెంచేందుకు వారితో ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డాని, ఆత‌రువాత భార‌త్ కు ప‌య‌న‌మైన‌ట్లు ఈ ప‌రిణామాల‌తో సంబంధం ఉన్న వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఈరోజు ఉద‌యం కోహ్లీ ఆస్ట్రేలియానుంచి బ‌య‌లుదేరాడు. అత‌డు వేళ్లే ముందు జ‌ట్టు బృందంతో భేటీ అయ్యాడు. ఆటగాళ్లలో ఆత్మ‌విశ్వాసం పెంచుతూ సానుకూల దృక్ప‌థంతో ఉండాల‌ని సూచించాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అధికారికంగా ర‌హానేకు అప్ప‌గించాడు. మైదానంలో మీ శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. రెండోటెస్టు త‌రువాత రోహిత్ శ‌ర్మ అందుబాటులోకి రానుండ‌గా యువ ఆట‌గాళ్ల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేయ‌డంలో ర‌హానే పాత్ర ప్ర‌స్తుతం కీల‌కంగా మారింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *