ఏపీలో రికార్డు స్థాయిలో క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు….

Corona virus diagnostic tests at record levels in AP. హైద‌రాబాద్ః ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. కొత్త‌గా 402 కేసులు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంటల్లో 56,425 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 402 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,339 కు చేరింది. 24 గంట‌ల్లో కొత్త‌గా న‌లురుగు క‌రోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,082కి చేరింది. ఈమేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 412 మంది క‌రోనా నుంచి కోలుకుని వివిధ ఆస్ప‌త్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3,978 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *