మ‌హిళా ఖైదీల‌కు మంచి రోజులు వ‌చ్చాయి…

హైద‌రాబాద్ః ఏపీ మ‌హిళా ఖైదీల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. యావ‌జ్జీవ శిక్ష‌ను అనుభ‌విస్తున్న మ‌హిళా ఖైదీల‌ను ముందుగానే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వివిధ జైళ్ల‌లో మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుద‌ల‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే, వీరి విడుద‌ల‌కు కొన్ని ష‌ర‌తుల‌ను విధించింది. విడుద‌ల కాబోయే మ‌హిళా ఖైదీలు రూ 50 వేలు పూచిక‌త్తు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. శిక్షాకాలం ప‌రిమితి ముగిసే వ‌ర‌కు ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక సారి పోలీస్ స్టేష‌న్ లో హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. అలాగే బ‌య‌ట‌కు వెళ్లిన త‌రువాత ఎలాంటి నేరాల‌ను పాల్ప‌డినా వెంట‌నే మ‌ళ్లీ అరెస్ట్ చేసి ముందస్తు విడుద‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *