మ‌రో ఎదురుదెబ్బ ఆస్ట్రేలియా జ‌ట్టుకు…

సిడ్నీః భార‌త్‌తో తొలి టీ 20లో ఓడిన అతిథ్య ఆస్ట్రేలియాకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే బ్యాట్ మ‌న్ డేవిడ్ వార్న‌ర్‌, స్పిన్న‌ర్ ఆస్ట‌న్ అగ‌ర్ గాయాల‌తో సిరీస్‌కు దూరం కాగా పేస‌ర్ పాట్ క‌మిన్స్‌కు విశ్రాంతినిచ్చారు. తాజాగా జ‌ట్టు కెప్టెన్ అరోన్‌ఫించ్ తొంటి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు కాన్‌బెర్రా వేదిక‌గా శుక్రవారం భార‌త్ తో తొలి టీ 20 లోఫీల్డింగ్ చేస్తుండ‌గా ఫించ్ గాయ‌ప‌డ్డాడు.ఆఖ‌రి రెండు టీ 20ల‌కు అత‌డు దూరంకానున్న‌ట్లు తెలుస్తోంది. ఫించ్‌ఫిట్‌గా లేక‌పోతే జ‌ట్టుకు ఎవ‌రు సార‌థ్యం వ‌హిస్తార‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఆల్‌రౌండ‌ర్ కెమెరాన్ గ్రీన్‌ను జ‌ట్టు నుంచి విడుద‌ల చేయ‌డంతో అత‌ని స్థానంలో ఆఫ్ స్పిన్న‌ర్ నాథ‌న్ లైయ‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. నాథ‌న్ చివ‌రిసారిగా 2018లో పాకిస్థాన్‌తో టీ 20 మ్యాచ్ ఆడాడు. సిడ్నీ వేదిక‌గా మిలిగిన రెండు టీ 20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరుజ‌ట్లు శ‌నివారం సిడ్నీ చేరుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *