తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభించిన సీఎం..

Andhrapradesh,CM JaganMohanReddy,starts,Tungabhadra pushkaral హైద‌రాబాద్ః క‌ర్నూలు జిల్లా సంక‌ల్‌బాగ్ షూట్‌లో తుంగ‌భ‌ద్ర పుర‌ష్క‌రాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. సంక‌ల్‌బాగ్ షూట్ వ‌ద్ద నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌లో సీఎం పాల్గొన్నారు. తుంగభ‌ద్ర న‌దికి పుసువు,కుంకుమ‌, సారె స‌మ‌ర్పించి…న‌దికి హార‌తినిచ్చి పుష్క‌రుడిని ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి డిసెంబ‌ర్‌1 వ‌ర‌కు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు జ‌గ‌నున్నాయి. పుష్క‌రాల కోసం క‌ర్నూలు జిల్లాలోని మంత్రాల‌యం, ఎమ్మిగ‌నూరు,కోడుమూరు, క‌ర్నూలు,నందికొట్కూరు నియోజ‌న‌వ‌ర్గాల‌లో క‌లిపి 23 పుష్క‌ర షూట్ల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. పుష్క‌రాల ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఇవాళ సాయంత్రం సాంస్కృతి కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. ప్ర‌ధాన షూట్ల‌లో సాయంత్రం గంగా హార‌తి ఉంటుంద‌న్నారు. సంక‌ల్‌బాట్ షూట్‌లో 12 రోజుల‌పాటు నిత్య హోమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *