దేశంలో ఉన్న సీఎంల‌కు లేఖ‌లు – సీఎం జ‌గ‌న్‌

హైదరాబాద్‌: ఇప్పుడు దేశాన్ని ప‌ట్టిపిడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను చాలా అవ‌స్థ‌ల‌గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి నేప‌థ్యంలో ఇండియాలో ఉన్న రాష్ట్రాల సీఎంల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ లేఖ‌లు రాశారు. కొవిడ్ వ్యాక్సిన్ విష‌యంలో ఆయ‌న లేఖ‌లు రాశారు. క‌రోనా వ్యాక్సిన్ల పంపిణీపై ఒకే వాయిస్ వినిపించాల‌ని కోరారు. గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచినా ఒక్క‌రూ బిడ్ వేయ‌లేద‌ని, గ్లోబ‌ల్ టెండ‌ర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉంద‌ని ఆయ‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఇలాంటి త‌ర‌ణంలో దేశంలో ఉన్న దుస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ల‌భ్య‌తపై కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య‌వివాదం త‌లెత్తేలా ఉంద‌ని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ రాష్ట్రాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *