ఆయుర్వేద వైద్యుని మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ..

అమ‌రావ‌తి: ఆయుర్వేద వైద్యుడు అయిన ఆనంద‌య్య కు క‌రోనా మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇంత‌కు ముందు ఆనంద‌య్య మంద‌ను జ‌గ‌న్ స‌ర్కారు నిలుపుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కొవిడ్ బాధితుల‌కు త‌క్ష‌ణ‌మే మందును స‌ర‌ఫ‌రా చేయాలంటూ ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్క‌ల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాల‌ని ధ‌ర్మాస‌నం సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌కు హైకోర్టు ఈనెల‌21కి వాయిదా వేసింది. కాగా.. సోమ‌వారం నుండి ఆనంద‌య్య ఔష‌దం పంప‌ణీ ప్రారంభ‌మైంది. కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదిక‌లు రావాల్సి ఉన్నాయంటూ గ‌తంలో ఏపీ స‌ర్కారు కె మందుకు అనుమ‌తిని ఇవ్వ‌లేదు. ఈ మందును క‌మిటీ ముందు చూపించ‌లేదు. కాబ‌ట్టి దీనికి ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. ఆనంద‌య్య ఇచ్చే పి, ఎల్‌, ఎఫ్‌…. మందుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్ర‌కారం రాష్ట్రప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆనంద‌య్య ఇస్తున్న మిగిలిన మందుల వ‌ల్ల హాని లేద‌ని నివేదిక‌లు తేల్చాయి. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్ర‌కారం ఆనందయ్య మందు వాడితే హాని లేద‌ని నివేదిక‌లు తేల్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *