బీసీసీఐ అధ్య‌క్షుడికి తీవ్ర అస్వ‌స్థ‌త..

బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్‌గంగూలీ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.2021 ,జ‌న‌వ‌రి 02 వ‌తేదీ శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న కోల్ క‌తాలోని వుడ్ లాండ్ ఆసుప‌త్రిలో చేరారు. ఉద‌యం జిమ్‌లో ఎక్స‌ర్ సైజ్ చేస్తుండగా… గుండెపోటు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. శ‌నివారం సాయంత్రం ఆయ‌న‌కు స‌ర్జ‌రీ చేస్తార‌ని స‌మాచారం. ఇటీవ‌లే ఆయ‌న 22 సార్లు క‌రోనా టెస్టులు చేయించుకున్న విష‌యం తెలిసిందే. నాలుగున్న‌ర నెల‌ల కాలంలో 22 సార్లు క‌రోనా టెస్టులు చేయించుకున్న‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ22 టెస్టుల్లో ఏ ఒక్క‌సారి కూడా త‌న‌కు పాజిటివ్ రాలేద‌న్నారు. యూఏఈలో నిర్వ‌హించిన ఐపీఎల్ టోర్నీ సంద‌ర్భంగా అక్క‌డ ప‌ర్య‌టించాల్సివ‌చ్చింద‌ని, ఆ త‌రువాత దేశంలో కూడా ప‌ర్య‌టించే స‌మ‌యంలో ఈ టెస్టులు చేయించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రోవైపు .. సౌర‌వ్ గంగూలీ రాజ‌కీయాల్లో రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో మమ‌తా బెన‌ర్జీని ఎదుర్కొనేంద‌కు గంగూలీని బీజేపీలో చేర్చుకుంటున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నా స‌యమంలో ఆదివారం వెస్ట్ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ను గంగూలీ క‌వ‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గంగూలీ…. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వేదిక పంచుకోవ‌డం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *