షిప్పింగ్ శాఖ పేరులో మార్పుః ప్ర‌ధాని మోదీ

న్యూఢీల్లీః షిప్పింగ్ శాఖ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్ వేస్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తెలిపారు. ఈ ఉద‌యం ప్ర‌ధాని మోదీ గుజరాత్‌లోని సూర‌త్‌- సౌరాష్ట్ర మ‌ధ్య రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్‌ను వీడియో క‌న్ప‌రెన్స్ ద్వ‌రా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పేరును కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌గా మార్చుతున్న‌ట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విద్యాశాఖ పేరును కూడా మార్చింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ (HRD మిని స్ట్రీ) ఉన్న పేరును కేంద్ర విద్యాశాఖ‌గా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *