ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు న‌మోదు గ‌డువు పెంపు…

హైద‌రాబాద్ః హైకోర్టుకు ఎన్నిక‌ల సంఘం నివేద‌న ఎమ్మెల్సీ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల న‌మోదు గ‌డ‌వు డిసెంబ‌ర్ 31వ‌ర‌కు ఉన్న‌ట్టు ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర ప్ర‌ధాన అధికారి హైకోర్టుకు తెలిపారు. దీనితో ఈ కేసులో త‌దుప‌రి ఎలాంటి ఉత్త‌ర్వులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.సెప్టెంబ‌ర్ 24న ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని న్యాయ‌వాది ర‌మేష్ వేసిన వ్యాజ్యంపై విచార‌ణ ముగించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర‌సింగ్ చౌహాన్‌, న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య‌సేన్‌రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీచేసింది. న‌మోదు చేసిన ఓటర్ల జాబితాపై ఎన్నిక‌ల సంఘం ముసాయిదాను డిసెంబ‌ర్ 1కి సిద్దం చేస్తుంద‌ని ,అదే నెల 31 వ‌ర‌కూ స‌వ‌ర‌ణ‌ల‌కు వీలుంటుంద‌ని, దీని ప్ర‌కారం ఓట‌ర్ల మార్పులు, చేర్పుల‌కు వీలుంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం నివేదించ‌డంతో రిట్‌పై విచార‌ణ ముగిసిన‌ట్లు హైకోర్టు ఉత్త‌ర్వులిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *