దేశం త‌ర‌పున ఆడ‌టం కంటే ఐపీఎల్ ముఖ్య‌మా?

ముంబైః తొడ‌కండ‌రాల గాయం నుంచి కోలుకున్న ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో బ‌రిలో దిగాడు. గాయంతో వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల‌కు దూర‌మైన రోహిత్‌ ఐపీఎల్‌లో మ‌ళ్లీ ఆడ‌టాన్ని మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్‌, మాజీ భార‌త కెప్టెన్ దిలీప్ వెంగ్‌ర్కార్ ప్ర‌శ్నించారు. దేశానికిప్రాతిన‌ధ్యం వ‌హించ‌డం కంటే లీగ్ ముఖ్య‌మా అని అడిగారు అస‌లు ఇప్పుడు ప్ర‌శ్నఏమిటంటే, భార‌త జాతీయ జ‌ట్టుకు ఆడ‌టం కంటే ఐపీఎల్ అత‌నికి ముఖ్య‌మా ? దేశం కోసం ఆడ‌టం క‌న్నా క్ల‌బ్ ముఖ్య‌మా?దీనిపై బీసీసిఐ ఎలా స్పందిస్తుంది. రోహిత్ గాయాన్ని స‌రిగ్గా గుర్తించ‌డంలో బీసీసీఐ ఫిజియో ఏదైనా పొర‌పాటు చేశారా? అని వెంగ్‌స‌ర్కార్ ప్ర‌శ్నించారు. రోహిత్‌కు గాయ‌మైంద‌ని బీసీసీఐ సెల‌క్ట‌ర్లు
అత‌న్ని ఆస్ర్టేలియా ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌ని విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *