ఎవ్వరిని బ‌తిమి‌లాడ‌వ‌ల్సీన‌ అవ‌స‌రం లేదు.

pawan,kalyan,post,in,janasena,twitter, pageజ‌నం కోసం ప‌నిచేసే జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ పార్టీ ట్విట్ట‌ర్ పేజ్ వేదిక‌గా పెట్టిన ఓ పోస్ట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీలో కొంత‌మంది ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ మీద ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ సాక్షిగా సొంత పార్టీలోని కొంద‌రి వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. నాయకులు న‌చ్చ‌క‌పోతే త‌మ‌కు హేతుబ‌ద్ధ‌త‌తో తెలియజేస్తే ట్ల‌డ‌తామ‌ని,అంతేగాని ఎవ‌రి చిత్తానికి వాళ్లు పార్టీలో ఉన్న నాయ‌కుల గురించి మాట్ల‌డితే కుద‌ర‌ద‌ని ప‌వ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అలా మాట్లాడాలంటే జ‌న‌సేనలో ఉంటూ తిడితే మాత్రం కచ్చితంగా కుదుర‌ద‌ని ప‌వ‌న్ క‌రాఖండిగా చెప్పేశారు. ఒక వంద మంది వెళ్లిపోతే బ‌ల‌హీన‌ప‌డే వ్య‌క్తిని కాన‌ని, వంద మంది తీసుకువ‌స్తామ‌ని ప‌వ‌న్ త‌న పోస్ట్‌లో ధీమా వ్య‌క్తం చేశారు. గ‌డ్డాలు పుచ్చుకుని బ‌తిమాల‌డ‌టం ఉండ‌ద‌ని జ‌న‌సేనాని తేల్చి చెప్పారు. రాజ‌కీయాలు త‌న‌కేం స‌ర‌దా కాద‌ని, రాజ‌కీయాలు త‌న‌కు బాధ్య‌త‌ని..ప్ర‌తి ఒక్క‌రు ఇదే స్పూర్తిని తీసుకువెళ్లాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు. అయితే, వ‌ప‌న్ పేర్కొన్న ఈ అంశాన్ని గ‌మ‌నించిన నెటిజ‌న్లు..ఏనేత‌ల గురించి జ‌న‌సేన‌లోని కొంద‌రు కార్య‌క‌ర్త‌లు మాట్లాడారో, ఎవ‌రినంటే ప‌వ‌న్‌కు ఈస్థాయిలో అస‌హ‌నం క‌లిగిందోన‌న్న చ‌ర్చ‌కు తెర‌లేపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *