ఆఖ‌రి స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది

దుబాయ్ః ఐపీఎల్‌-13 వ సీజ‌న్ ఆఖ‌రి స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. మంగ‌ళ‌వారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగే ఫైన‌ల్లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టైటిల్ ద‌క్కించుకోవాల‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని ఢిల్లీ ఆస‌క్తితో ఉండ‌గా .. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదు టైటిల్‌పై క‌న్నేసింది. సీజ‌న్ లీగ్ ద‌శ‌లో ఢిల్లీతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై విజయం సాధించింది. తొలిసారి ఫైన‌ల్ చేరిన ఢిల్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సార్లు ఫైన‌ల్ చేరిన ముంబైని ఎలా ఎదుర్కొంటుందో ఆస‌క్తిక‌రంగా మారింది. క్వాలిఫ‌య‌ర్‌-2 లో హైద‌రాబాద్‌పై పోరాడి గెలిచిన ఢిల్లీ టైటిల్ పోరులో ముంబైకి గ‌ట్టిపోటీనివ్వ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *